గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (11:40 IST)

ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల

ముంబై డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు.. ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యాడు. ముంబై మహా నగరం లోని అర్థర్‌ రోడ్‌ జైలు నుంచి షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ రిలీజ్‌ అయ్యారు.
 
బెయిల్‌ పై ఆర్యన్‌ ఖాన్‌ కాసేపటి క్రితమే విడుదల అయ్యారు. ఇక ఆర్యన్‌ ఖాన్‌ విడుదల నేపథ్యంలో… అతనికి భారీగా స్వాగతం పలికారు ఆయన కుటుంబ సభ్యులు. ఆర్యన్‌ ఖాన్‌ విడుదల నేపథ్యం లో జైలు వద్దకు చేరుకున్న షారూఖ్‌ ఖాన్‌ కుటుంబం.. ఎంతో ఆప్యాయంగా ఆర్యన్ ఖాన్‌ కు స్వాగతం పలికారు. 
 
కాగా… డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. రెండు సార్లు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపినా ఫలించ‌లేదు. గురువారం ఆర్య‌న్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఇవాళ ఆయ‌న జైలు నుండి విడుద‌ల అయ్యారు.