సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (08:21 IST)

ప్ర‌తిభావంతుల‌తో బి.ఎ.రాజు నూత‌న చిత్రం!

తెలుగులో ప్ర‌తిభావంతులైన‌వారు ఎంద‌రో వున్నారు. గ‌తంలో తాము తీసిన చిత్రాల‌తో కొత్త‌వారిని, ప్ర‌తిభావంతుల‌ని ప‌రిచ‌యం చేశామ‌ని సూప‌ర్‌హిట్ ప్ర‌తిక అధినేత‌, ప్ర‌ముఖ నిర్మాత బి.ఎ. రాజు తెలియ‌జేస్తున్నారు. ఈ ఏడాది నూత‌న తార‌ల‌తో కొత్త చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం ఆయ‌న పుట్టిన‌రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక సిబ్బంది వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. మా సంస్థ నిర్మించిన చంటిగాడు.. చిత్రం ద్వారా బాల‌న‌టుడు  బాలాదిత్య‌ను హీరోగా చేశాం. `ప్రేమికుడు`తో కామ్న జ‌ట్మ‌లానీని, `ల‌వ్లీ`లో శాన్వీ శ్రీ‌వాస్త‌వ‌ను నాయిక‌గా ప‌రిచ‌యం చేశాం. 
 
`వైశాఖం`లో హ‌రీశ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాం. తాజా చిత్రంతో ప్ర‌తిభావంతులైన కొంద‌రిని ప‌రిచ‌యం చేస్తున్నాం అనితెలిపారు. తెలుగు సినిమా రంగంలో బి.ఎ.రాజు అంటే తెలియ‌ని వారు వుండ‌దు. చిన్న‌, పెద్ద హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత అనే తేడా లేకుండా అంద‌రికీ త‌లలో నాలుక‌గా మెలిగే ఆయ‌న స్పురద్రూపిగా పేరుగాంచారు. ఆయ‌న నిర్మాత‌గా మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని వెబ్ దునియా ఆకాక్షిస్తోంది.