బాహుబలి: చివరి దశలో రీ-రికార్డింగ్...జూలై 10న రిలీజ్
బాహుబలి రిలీజ్‌కు ముస్తాబవుతోంది. రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో ఉంది. ఎంఎం కీరవాణి, రాజమౌళి ఈ సినిమా రీ-రికార్డింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. బాహుబలి ది బిగినింగ్ తొలి పార్ట్‌కు అడ్వాన్స్ సౌండ్ టెక్నాలజీని అందిస్తున్నట్లు రాజమౌళి టీమ్ సమాచారం. కాగా బాహుబలి జూలై పదో తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా ఉన్నారు.
ఇప్పటికే బాహుబలి డైలాగ్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా పది రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమా కోసం సినీ ప్రేక్షకులు వేయి కనులతో వేచి చూస్తున్నారు. అద్భుతమైన విశేషాంశాలతో భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం తప్పదని సినీ పండితులు అంటున్నారు.