శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (02:17 IST)

రూ. 400 కోట్లకు చేరువలో హిందీ బాహుబలి-2.. మరోవారంలోపే రూ.500 కోట్ల వసూళ్లు ఖాయం.

బాహుబలి-2 కి ఎందుకంత మిడిసిపాటు? మా దంగల్ ఇంకా బరిలో ఉంది. చైనాలో కలెక్షన్లతో దూసుకుపోతుంది చూడండి అన్నవారి నోళ్లు ఈ గురువారంతో మూతపడిపోయాయి. ఎందుకంటే విడుదలైన రెండు వారాలకే దంగల్ హిందీలో సాధించిన లైఫ్ టైమ్ రికార్డును బాహుబలి-2 తుడిచిపెట్టేసింది. హిం

బాహుబలి-2 కి ఎందుకంత మిడిసిపాటు? మా దంగల్ ఇంకా బరిలో ఉంది. చైనాలో కలెక్షన్లతో దూసుకుపోతుంది చూడండి అన్నవారి నోళ్లు ఈ గురువారంతో మూతపడిపోయాయి. ఎందుకంటే విడుదలైన రెండు వారాలకే దంగల్ హిందీలో సాధించిన లైఫ్ టైమ్ రికార్డును బాహుబలి-2 తుడిచిపెట్టేసింది. హిందీప్రాంతంలో దంగల్ పేరిట నమోదైన రికార్డును బాహుబలి2 విడుదలైన రెండు వారాలకు అంటే సరిగ్గా 14 రోజులకు తన ఖాతాలో కలిపేసుకుంది. బాహుబలి2 వ్యతిరేకులు, ఖాన్‌లో అనుయాయులు, తెలుగు చిత్ర పరిశ్రమ క్వాలిటీపై ఇప్పటికే విషం కక్కుతున్న బాలీవుడ్ మీడియా గుండె పగిలేలా బాహుబలి 2 హిందీ సినిమా రూ. 390.25 కోట్ల నెట్‌ కలెక్షన్లతో ఆల్‌టైమ్‌ టాప్‌గా నిలిచింది.

ఈ రోజునుంచి బాహుబలి 2 అభిమానులు, టాలీవుడ్ అభిమానులు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే బాహుబలి2ని సమీప భవిష్యత్తులో ఏ ఖాన్‌లూ బీట్ చేయలేరు. ఇప్పటికే 400 కోట్లకు చేరువైన ఈ సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే మూడోవారాంతానికి ముందే 500 కోట్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్టులు తేల్చి చెబుతున్నారు. 
 
ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి గుండెకాయగా పరిగణించబడే బాలీవుడ్‌లోనూ టాప్‌గా నిలిచింది బాహుబలి-2. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’  మరో ఘనత సాధించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది.

‘దంగల్‌’ పేరిట ఉన్న రికార్డును రెండు వారాల్లోనే తుడిచిపెట్టేసింది. రూ. 375 కోట్ల నెట్‌ వసూళ్లతో ఇప్పటివరకు దంగల్‌ అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ సినిమా రూ. 390.25 కోట్ల నెట్‌ కలెక్షన్లతో ఆల్‌టైమ్‌ టాప్‌గా నిలిచింది. ఈ సినిమా మొదటి వారంలో రూ. 247 కోట్లు, రెండో వారంలో రూ. 143.25 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. 
 
అమెరికాలో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి-2 నిలిచింది. నమ్మశక్యం కానివిధంగా తమిళనాడులోనూ రూ. 100 కోట్ల మైలురాయికి చేరువగా ఉంది. తమిళ చిత్రపరిశ్రమ చరిత్రలో ఏ తమిళ హీరో చిత్రానికి, చివరకు రజనీకాంత్ చిత్రానికి కూడా వందకోట్ల కలెక్షన్ ఇంతవరకు రాలేదు.

తమిళనాడులో కేవలం 650 థియేటర్లలో మాత్రమే విడుదలైన బాహుబలి-2 చిత్రం ఇంత సెన్సేషనల్ హిట్ సాధించటానికి ప్రధాన కారణం ఆ రాష్ట్రంలోని కుటుంబ ప్రేక్షకులు బాహుబలి-2కి దాసోహం అయిపోవడమే అంటున్నారు విశ్లేషకులు. 
 
చూసినవారే తమ పిల్లల ఒత్తిడితో మల్లీ మళ్లీ థియేటర్లకు పరుగు తీస్తుండటం వల్లే ఇంత  భారీ కలెక్షన్లు తమిళనాడులో వస్తున్నాయని టాక్. ఈ నేపథ్యంలో బాహుబలి అమ్మమ్మను మించిన సినిమా తీసి బాహుబలి-2 రికార్డును చెదరగొట్టాలని కోలీవుడ్ మొత్తంగా ఐక్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం తమిళంలో పౌరాణికాలు లేవా.. తీసేవారు లేరా అంటూ ఆటోగ్రాఫ్ సినీ దర్శకుడు, హీరో  చేరన్ హుంకరించడంలో ఇదే ధ్వనిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రూ. 250 కోట్లుపైగా కలెక్ట్‌ చేసింది. కేరళలో రూ. 50 కోట్లుపైగా బిజినెస్‌ చేసింది. ఇక కర్నాటకలో ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు మొత్తం వంద కోట్ల కలెక్షన్ చేరువకు వచ్చినట్లు సమాచారం. 
 
మరోవైపు భారతదేశంలోనే రూ. 1000 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 చలనచిత్ర చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించింది.