Widgets Magazine

రూ. 432 కోట్లు సాధించిన బాహుబలి-2 హిందీ వెర్షన్.. రూ. 1500 కోట్లకు చేరువగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లు

హైదరాబాద్, మంగళవారం, 16 మే 2017 (07:48 IST)

Widgets Magazine

దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ ప్రభంజనం కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బాహుబలి-2 ఉత్తరాదిన ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. కేవలం 17 రోజుల్లో రూ.428 కోట్లు వసూలు చేసిన హిందీ వెర్షన్ స్ట్రెయిట్ హిందీ చిత్రాల అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. ఉత్తరాదిన  మూడో వారాంతంలో రూ. 41.50 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా బాహుబలి-2  రికార్డు కెక్కింది. విడుదలైన తొలివారం ఉత్తరాదిన రూ.245 కోట్లు, రెండో వారం రూ. 141 కోట్లు సాధించిన హిందీ బాహుబలి-2 మూడోవారాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు సాధించిన 41.50 కోట్లతో మొత్తం రూ. 428 కోట్లు సాదించింది. ఈ లెక్కన చూస్తే మూడోవారం ముగిసేసరికి హిందీ బాహుబలి-2 రూ. 500 కోట్ల మార్కును అధిగమిస్తుందని అంచనా..
prabhas-anushka
 
సోమవారం కలెక్షన్లను కూడా కలిపితే విడుదలైన 18 రోజుల్లోబాహుబలి హిందీ వెర్షన్ రూ. 432.80 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పుడు హిందీ బాహుబలి 500 కో్ట్ల రూపాయల కలెక్షన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. మూడోవారాంతంలో శుక్రవారం 10.05 కోట్లు, శనివారం 14.75 కోట్లు, ఆదివారం 17.75 కోట్లు అంటే మూడురోజుల్లో 41 కోట్లకు పైగా సాధించిన బాహుబలి 2 బాలీవుడ్ రికార్డును సవరించింది. ఉత్తరాదిన ఏ హిందీ చిత్రం కూడా మూడోవారంతంలో మూడురోజులు కలిపి ఇంత మొత్తం ఇంతకుముందు సాదించిన చరిత్ర లేదు.
 
హిందీలో తాజాగా విడుదలైన రామ్ గోపాల్ వర్మ సర్కార్3 చిత్రం శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా రూ. 2.10, రూ.2.25, రూ.2.40 కోట్లతో మొత్తం 6.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇక మేరే ప్యారి బిందు అనే మరో కొత్త సినిమా శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా రూ. 1.75 కోట్లు, 2.25 కోట్లు, 2.50 కోట్లతో మొత్తం 6.50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. కానీ బాహుబలి-2 వారాంతపు కలెక్షన్లు ఈ రెండు సినిమాల కలెక్షన్లను మించి 41 కోట్లపైగా వసూలు చేయడం బాలీవుడ్‌ను బిత్తర పోయేలా చేసింది.
 
ఇప్పుడు సినిమా కలెక్షన్లతోపాటు ఒక వార్త ఉత్తరాదిని ఊపేస్తోంది. మహేంద్రబాహుబలిగా నటించిన చిన్నబ్బాయి, శివగామి నదిలో పైకి ఎత్తి పట్టుకున్న అబ్బాయి వాస్తవానికి అబ్బాయి కాదని, అమ్మాయి అని బాలీవుడ్‌కు కాస్త ఆలస్యంగా వార్త చేరింది. పైగా ఆ పాత్రకు గాను ఆమెను తీసుకున్న సమయానికి వయస్సు కేవలం 18 రోజులే అని తెలిసి బాలీవుడ్ నివ్వెరపోతోంది. కేరళ నివాసి అయిన బాహుబలి యూనిట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి చెందిన పాప ఆమె. పేరు అక్షిత వలసన్.
 
బాహుబలి కలెక్షన్లు ఇలా ఉండగా చిత్ర నిర్మాతలు అతి త్వరలో రెండో భాగాన్ని చైనా, జపాన్ దేశాల్లో విడుదల చేయడానికి పూనుకుంటున్నారు. ఈ రెండు దేశాల్లో విడుదల చేస్తే బాహుబలి-2 రెండు వేల కోట్లను సాధించడం పెద్ద కష్టమేం కాదని అంచనా.. మరోవైపు దక్షిణ భారత సినిమాలను రీమేక్ చేస్తూ కలెక్షన్ల బాదుషాలుగా ఇన్నాళ్లూ ఫోజు కొట్టిన ఖాన్ త్రయానికి బాహుబలి-2 పెద్ద గుణపాఠం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

taran adarsh ✔ @taran_adarsh
#Sarkar3 Fri ₹ 2.10 cr, Sat 2.25 cr, Sun 2.40 cr. Total ₹ 6.75 cr. India biz.
237 PM - 15 May 2017
 
taran adarsh ✔ @taran_adarsh
#Baahubali2 is now racing towards ₹ 450 cr... [Week 3] Fri 10.05 cr, Sat 14.75 cr, Sun 17.75 cr. Total ₹ 432.80 cr Nett. HINDI. India biz.
157 PM - 15 May 2017
  
 taran adarsh ✔ @taran_adarsh
#MeriPyaariBindu Fri 1.75 cr, Sat 2.25 cr, Sun 2.50 cr. Total ₹ 6.50 cr. India biz.
125 PM - 15 May 2017
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైనాలో దంగల్ సునామీ.. టాప్ వన్ సినిమాగా అమీర్ ఖాన్ రికార్డు.. బాహుబలి-2కి నిజమైన పోటీ

చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తున్న అమీర్ ఖాన్ చిత్రం దంగల్ హాలీవుడ్ తాజా చిత్రాలను కూడా ...

news

కేరళలో 50 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన బాహుబలి-2.. మాలివుడ్ ఆల్ టైమ్ కలెక్షన్ల చరిత్రలో రెండో స్థానం

కేరళ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డుకు చేరువవుతున్న బాహుబలి-2 చిత్రం రెండు వారాల్లో రూ. ...

news

‘బాహుబలి-2’ నిర్మాతలకు సైబర్ నేరస్తుల బెదిరింపులు.. రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్

ఇంతవరకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకే పరిమితమైన మాఫియా బెదిరింపులు టాలీవుడ్‌కీ పాకుతున్నట్లు ...

news

'బాహుబలి-2' సినీమేనియా... కుమార్తెకు ఆ పేరు పెట్టిన బాలీవుడ్ హీరో భార్య

సినీ అభిమానుల సంగతి అటుంచితే... చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పటికీ బాహుబలి మేనియా ...