బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By vasu
Last Modified: గురువారం, 4 మే 2017 (18:02 IST)

'బాహుబలి'లో ఎవరెవరికెంతెంత? కాస్త మిర్చి రైతులకివ్వరూ....

సంవత్సరాల తరబడి ప్రేక్షకలకు కొందరు నటీ నటులను కనబడనివ్వకుండా దూరం చేసి తద్వారా ప్రేక్షకులలో ఒక ఉద్విగ్నతను పుట్టించి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్‌తో మరింత వేడిని చేర్చిన బాహుబలి మొత్తం మీద ఎడిటింగ్‌ల మహిమో మరేమో కానీ సగటు ప్రేక్షకుల

సంవత్సరాల తరబడి ప్రేక్షకలకు కొందరు నటీ నటులను కనబడనివ్వకుండా దూరం చేసి తద్వారా ప్రేక్షకులలో ఒక ఉద్విగ్నతను పుట్టించి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్‌తో మరింత వేడిని చేర్చిన బాహుబలి మొత్తం మీద ఎడిటింగ్‌ల మహిమో మరేమో కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం పూర్తి సినిమాను చూసిన భావనను దూరం చేసిందనే చెప్పాలి.
 
కాగా, సంవత్సరాల తరబడి తెరకు దూరమై కత్తిసాములు, గుర్రపు స్వారీలు నేర్చుకున్న నటులకు ప్రేక్షకుల నీరాజనాలతో పాటుగా బాగానే గిట్టుబాటైనట్లు సమాచారం. కట్టప్పగా చేసిన సత్యరాజ్‌కు 2 కోట్ల రూపాయలు, శివగామి పాత్రలో విశ్వరూపాన్ని చూపిన రమ్యకృష్ణకు 2.5 కోట్లు రూపాయలు, దేవసేనగా నటించిన అనుష్కకు 5 కోట్ల రూపాయలు, అవంతికగా నటించిన తమన్నాకు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వినికిడి. 
 
ఇక ప్రతినాయకుడి పాత్రలో జీవించిన రాణాకు 15 కోట్ల రూపాయలు, శివుడిగా బాహుబలిగా ద్విపాత్రాభినయంతో మెప్పించిన ప్రభాస్‌కు 25 కోట్ల రూపాయలు, వీరందరి కంటే ఎక్కువగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తపన పడుతూ ఇంత మంది ప్రేక్షకులను ఉద్విగ్నతకు గురి చేసిన జక్కన్న రాజమౌళికి 28 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్లు సమాచారం.
 
అయితే, ఇంత భారీగా రెమ్యూనరేషన్‌లు తీసుకుని ఇంత భారీగా వసూళ్లు చేసిన ఈ చిత్ర యూనిట్ తమ వసూళ్లలో కాస్తైనా రాష్ట్ర రైతుల కోసం విరాళంగా అందజేయాలనే వాదన కూడా కొత్తగా తెర మీదకు వస్తోంది. జక్కన్న ఏం చేయబోతున్నారో చూడాలి మరి.