Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 స్ఫూర్తితో అత్యంత భారీ చిత్రం 'కురుక్షేత్ర'కు సై అంటున్న కన్నడ నాడు

హైదరాబాద్, బుధవారం, 17 మే 2017 (08:27 IST)

Widgets Magazine

కర్నాటకలో, ప్రత్యేకించి బెంగళూరు మహానగరంలో చిత్రం సాధించిన రికార్డు కలెక్షన్ల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమ శాండల్ వుడ్‌పై పడింది. కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో అత్యంత భారీ చిత్రాన్ని నిర్మించడానికి కన్నడ చిత్ర పరిశ్రమ సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి అద్భుత విజయం ప్రేరణగా ఒక కన్నడ చిత్ర నిర్మాత మహభారతం ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో పౌరాణిక చిత్రాన్ని తీయడానికి పూనుకుంటున్నారు.
prabhas-anushka
 
కన్నడ చిత్ర నిర్మాత, రాజకీయ నేత ఎన్ మునిరత్న అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కౌరవ రాజు ధుర్యోధనుడు ఇతివృత్తంగా తీస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు విజువల్ ఎఫెక్టులు ప్రత్యేకమని చెప్పాల్సిన పని లేదు పౌరాణిక యుగంలోని యుద్ధ దృశ్యాలను అతి భారీగా తీయడానికి గ్రాఫిక్స్‌ను భారీ స్థాయిలో ఉపయోగించనున్నట్లు నిర్మాత తెలిపారు.  ఈ ఏడాది జూలై 23న ప్రారంభం కానున్న ఈ చిత్ర నిర్మాణం ఆరునెలల్లో పూర్తి చేసుకుని సంవత్సరం చివర్లో విడుదల చేస్తామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ బాహుబలి-2 విజయం తనకు మార్గ దర్శనం చేసిందన్నారు. బెంగళూరు అతి పెద్ద కేంద్రం, కన్నడ చిత్రాలు కూడా ఈ నగరంలోని మార్కెట్ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోగలదు. ఈ శక్తిని ఉపయోగించే ఉద్దేశంతోనే కురుక్షేత్ర సినిమా తీస్తున్నాను అన్నారు. పలు కన్నడ సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన మునిరత్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. బాహుబలి-2 తొలి వారం చివరకే వెయ్యి కోట్ల వసూళ్లను సాదించగా బెంగళూరు షేర్ 300 కోట్ల మేరకు ఉందని చెబుతున్నారు. 
 
ఇంతవరకు కన్నడ సినిమాలపై భారీ పెట్టుబడులు అంటే నష్టంతో కూడిన వ్యవహారమని భావించేవారు. బాహుబలి-2 ఇచ్చిన స్ఫూర్తితో కర్నాటక కూడా భారీ చిత్రాల నిర్మాణానికి సాహసిస్తోంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాహో టీమ్‌కు చుక్కలు చూపించిన బాలీవుడ్ భామలు.. ప్రభాస్ తాజా సినిమాకు అనుష్క ఫిక్స్ అట

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహోలో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టి మరింత మార్కెట్ ...

news

దమ్ములేకపోతే వైభవం లేదు.. బాహుబలి-2 నిర్వచనం ఇదే.. సినిమా చూడకున్నా ఆకాశానికెత్తిన షారుఖ్ ఖాన్

దమ్ము లేకపోతే, సాహసించకపోతే వైభవం ఊరికే రాదని బాహుబలి విజయం నిరూపిస్తోందని బాలీవుడ్ ...

news

రూ. 500 కోట్ల లక్ష్యం దిశగా బాహుబలి-2: ముంబైలో కరణ్ జోహార్ పార్టీలే పార్టీలు

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి-2 ది కంక్లూజన్ జాతీయ, ...

news

రాజకీయ నేతల్లో బాహుబలి-2 సునామీ.. ఇక్కడా రాజకీయాలే మరి

దేశం దేశం బాహుబలి సినిమా జ్వరంతో వేగిపోతోంది. బాహుబలి చూడని వాడు పాపాత్ముడు లెక్కన నేటికీ ...