శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (11:12 IST)

బాహుబలి రికార్డుల పంట: ''కత్తి'' రికార్డ్ బ్రేక్.. వసూళ్లతో ముందడుగు

బాహుబలి రికార్డుల పంట పండిస్తోంది. ఆస్కార్ వేడుకల వరకు వెళ్లిన బాహుబలి తమిళనాట భారీగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ఇళయదళపతి విజయ్ కత్తి సినిమా పేరున్న రికార్డును తన పేరున రాయించుకుని ముందుకు సాగిపోతున్నాడు. బాహుబలి తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి.. ఆయా ప్రాంతాల్లో అనువాద చిత్రంగా అడుగుపెట్టి, అక్కడి స్ట్రైట్ చిత్రాలను .. అందునా అగ్రకథానాయకుల సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. 
 
భారీస్థాయిలో వసూళ్లను రాబడుతూ .. 50 రోజుల మైలురాయిని దాటుకుని సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో గతంలో 'కత్తి' సినిమా సాధించిన వసూళ్లను అధిగమించింది. స్టార్ హీరో విజయ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కత్తి ఒకటి. చెన్నైలో ఆయనకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఈ సినిమా పేరు రికార్డుల్లో కనిపిస్తుంది. తాజాగా ఆ రికార్డును అధిగమించి, బాహుబలి మరోసారి తన సత్తా చాటుకోవడం గమనార్హం.