శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 2 జూన్ 2017 (08:59 IST)

బాహుబలి నా జీవితంలో ఒక భాగం కాదు.. నా జీవితమే బాహుబలి అంటున్న ప్రభాస్

గత ఐదేళ్లుగా బాహుబలి నా జీవితాన్ని ఆవహించినట్లు భావిస్తున్నాను తప్ప నా జీవితంలో బాహుబలి ఒక భాగం అని ఎన్నడూ అనుకోలేదని బాహుబలి చిత్ర హీరో ప్రభాస్ చెప్పారు. తెలుగు సినిమా సూపర్ స్టార్లలో ఒకరైన ప్రభాస్ త

గత ఐదేళ్లుగా బాహుబలి నా జీవితాన్ని ఆవహించినట్లు భావిస్తున్నాను తప్ప నా జీవితంలో బాహుబలి ఒక భాగం అని ఎన్నడూ అనుకోలేదని బాహుబలి చిత్ర హీరో ప్రభాస్ చెప్పారు. తెలుగు సినిమా సూపర్ స్టార్లలో ఒకరైన ప్రభాస్ తన బాహుబలి పాత్రతో దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి షూటింగులో పాల్గొన్నంత కాలం ఏ ఇతర సినిమాలోనూ నటించని, సైన్ చేయని ప్రభాస్ దానికి బ్రహ్మాండమైన ఫలితం బాహుబలి2 ద్వారా అందుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో స్నేహితులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ బాహుబలి తన జీవితంతో ఎలా ముడివేసుకుందో మీడియాతో పంచుకున్నారు.
 
అయిదేళ్ల సుదీర్ఘకాలం అనుబంధం పెంచుకున్న దానికి దూరం జరగడం, దూరం కావడం చాలా కష్టం. గత అయిదేళ్ల కాలంలో బాహబలి నా జీవితంలో ఒక భాగంగా లేదు. బాహుబలే నా జీవితమైంది. ఈ అయిదేళ్లుగా వ్యక్తిగా నేను నేనుగా ఉన్నదానికంటే బాహుబలిగానే ఎక్కువగా ఉంటూవచ్చాను అంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పేర్కొన్నారు.
 
ఇప్పుడు బాహుబలి సింప్టమ్స్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నాను. అలా బయటపడటం కూడా సహజమే. కానీ దేశమంతటా ప్రజలు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు నన్ను పూర్తిగా ముంచెత్తుతున్నాయి. అన్నాడు 37 సంవత్సరాల ప్రభాస్.
 
బాలీవుడ్ హిందీ వెర్షన్‌ రెండు భాగాలను ప్రమోట్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హిందీ డైరెక్ట్ చిత్రంలో నటించనున్నట్లు వస్తున్న వార్తలను ప్రభాస్ సున్నింతంగా తోసిపుచ్చాడు. దీనిపై వెంటనే ప్లాన్ చేసుకోలేదు. కాని ఇది ఆసక్తికరమైన విషయం. ఇంత సుదీర్ఘ కాలం వారితో కలిసి పనిచేసిన తర్వాత రాజమౌళి, కరణ్ లతో పనిచేయడం అనేది నాకు హోమ్ గ్రౌండ్‌లాగే భావిస్తున్నాను. కాని బాహుబలి పాన్ ఇండియా స్థాయి కలిగిన సినిమాలకు తలుపులు తెరిచిందన్నాడు ప్రభాస్. 
 
రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రభాస్. తన దార్శనికతను వాస్తవంగా మార్చడంలో రాజమౌళి సామర్థ్యం నన్నెప్పడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. రాజమౌళి గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనను జీనియస్ అని పిలవడం అంటే అది ఆయన్ని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. శక్తివంతమైన విజన్ కలిగి ఉండటమే కాదు దానికి ప్రాణం పోయగల సాధనాలు, పద్ధతులు కూడా రాజమౌళికి తెలుసు అన్నాడు ప్రభాస్.
 
దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-2 ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం లేనంతగా ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టు సాహో చిత్రంలోకి వెళ్లిపోయాడు. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో సాహోను విడుదల చేయనున్నారు. ప్రభాస్ దీనిపై మాట్లాడుతూ బాహుబలి పాత్రకు పూర్తిగా భిన్నమైన కేరక్టర్ సాహోలో చూస్తారు. సాహోలో నా పాత్ర గురించి ఉద్వేగంతో ఉన్నాను. ఇప్పుడే వివరాలు చెప్పలేను కాని మేము ఈ సినిమాకోసం ఉత్తమ బృందాలతో కలిసి పనిచేస్తున్నాము. సినిమాపై మాకు గొప్ప విజన్ ఉంది. చాలా బలమైన కథతో ఇది తయారైందని ప్రభాస్ చెప్పారు. 
 
బాహుబలి 2 వెర్షన్ మే 31 నాటికి ఒక్క హిందీ బాషలోనే 500 కోట్ల రూపాయల కలెక్ష‌ను దాటేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్ల కలెక్షన్లు దాటిన బాహుబలి 2 తాజాగా 1700 కోట్ల కలెక్షన్ల మైలురాయికి చేరువలో ఉంది. ఒక భారతీయ సినిమా విడుదలైన 30 రోజుల్లోనే 1600 కోట్ల కలెక్ష్లను వసూలు చేయడం ఇదే తొలిసారి. పైరసీ బారిన పడకుంటే బాహుబలి తొలి రిలీజ్ లోనే 2000 కోట్ల  కలెక్షన్లను సాధించి ఉంటుందని అనలిస్టులు చెప్పడం గమనార్హం.