శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (16:46 IST)

బాహుబలి- ది కన్‌క్లూజన్: సెంటిమెంట్స్ అదిరిపోతాయట.. బిగినింగ్ కంటే..?!

బాహుబలి- ది కన్‌క్లూజన్‌ కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ది బిగినింగ్‌ చూసేశాక బాహుబలి కన్‌క్లూజన్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈగ డైరక్టర్, బాహుబలి మేకర్ రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. 2016 చివరి కల్లా బాహుబలి 2 తెరపైకి వచ్చేస్తుందని చెప్పారు. బాహుబలి-ది బిగినింగ్ సినిమాను బుసాన్ ఇంటర్నల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి బాహుబలి 2కు సంబంధించిన పనులు 40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. నవంబర్ నుంచి బాహుబలి 2 సెట్స్ పైకి వస్తాడని, ఇందులో ఎమోషన్స్, సెంటిమెంట్స్‌కు ఏమాత్రం తక్కువుండదని.. తప్పకుండా ప్రేక్షకులను బాహుబలి ఆకట్టుకుంటాడని రాజమౌళి ఆకాంక్షించారు.

యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి 2కు హైలైట్‌గా నిలుస్తాయన్నారు. ఇకపోతే.. బాహుబలి-బిగినింగ్ చైనా, జపాన్‌లో రిలీజైంది. మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు చర్చ సాగుతోందని రాజమౌళి వ్యాఖ్యానించారు.