1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (15:52 IST)

ఖైదీ రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి-2.. అమెరికాలో 3 మిలియన్ డాలర్ల వసూళ్లు

బాహుబలి-2 సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దేశంలో 9వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. భారత్‌లోనే కాకుండా దుబాయ్, కువైట్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ వంటి దేశాలన్నింటిలోన

బాహుబలి-2 సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దేశంలో 9వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. భారత్‌లోనే కాకుండా దుబాయ్, కువైట్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ వంటి దేశాలన్నింటిలోనూ బాహుబలి-2 ప్రభంజనం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బాహుబలి2 మెగాస్టార్ చిరంజీవి ఖైదీ రికార్డును అధిగమించాడు. "ఖైదీ నెంబర్ 150'' ఓవరాల్ కలెక్షన్లను ప్రీ బుకింగ్స్‌తోనే బాహుబలి-2 కొల్లగొట్టింది. 
 
అమెరికాలో ఖైదీ 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, బాహుబలి-2 అదే ప్రీ బుక్సింగ్ ద్వారా ఏకంగా 3 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ తెలిపింది. ఇంకా అమెరికా మొత్తం మీద విడుదలవుతున్న అన్ని భాషల్లో కలిపి 1100 స్క్రీన్లలో బాహుబలి-2 సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. బాహుబలి-2 ప్రీమియర్ షోలు హిందీలో రద్దయ్యాయి. 
 
అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నా మృతి చెందడంతో...  ప్రీమియర్ రద్దు చేస్తున్నట్లు బాహుబలి-2ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘బాలీవుడ్ అమితంగా ఇష్టపడే నటుడు వినోద్ ఖన్నా మరణానికి సంతాప సూచకంగా.. ఈ రోజు రాత్రి వేయాల్సిన బాహుబలి ప్రీమియర్‌ను రద్దు చేస్తున్నాం. బాహుబలి టీం మొత్తం తీసుకున్న నిర్ణయమిది’’ అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.