Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 లో కరణ్ జోహార్ లాభం ఎంతో తెలుసా.. నేటికి రూ.285 కోట్లు..

హైదరాబాద్, శుక్రవారం, 12 మే 2017 (03:54 IST)

Widgets Magazine
Farah-karan

మన కళ్లముందు కదులాడుతున్నవి అంకెలే అయితే ఇది నిజం. ముమ్మాటికీ నిజం. భూమ్మీద ఇప్పుడు మహాదృష్టవంతుడు ఎవరు అంటే బాహుబలి-2 హిందీ రైట్స్ తీసుకున్న కరణ్ జోహార్ అనే చెప్పాలి. చిత్ర నిర్మాతలకు కూడా లేనట్లుగా ఇప్పటికే హిందీ బాహుబలి-2కి కరణ్ మూడు రెట్ల లాభాలు సాధించి వెలిగిపోతున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఒకసారి ఈ లెక్కలకేసి పరిశీలిద్దాం. అప్పుడే కరణ్ జోహార్ అదృష్టం ఎంతో అర్థమవుతుంది.
 
‘బాహుబలి–2’ హిందీ థియేట్రికల్‌ రైట్స్‌ను రూ. 80కోట్లకు సొంతం చేసుకున్న కరణ్‌ జోహార్‌ పబ్లిసిటీకి అదనంగా ఓ 10 కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం!  అంటే హిందీ బాహుబలి2 కి కరణ్ పెట్టిన  మొత్తం ఖర్చు 90 కోట్లు‌. ఇటుకలు కాదు.. రూపాయలే.  ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ. 375.35 కోట్లు కలెక్ట్‌ చేసింది. అంటే నిర్మాతకు రూ. 285.35కోట్లు లాభం). ఇంకో లాభం ఏంటంటే.. బాహుబలి2 మరో పన్నెండు కోట్లు కలెక్ట్‌ చేస్తే ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ ఇండియా (రూ. 387.38 కోట్లు) రికార్డును బీట్‌ చేసేస్తుంది. 
 
అయితే... 12 కోట్లు ఏంటి.. మరో 25 కోట్లు కలెక్ట్‌ చేసి రూ. 400 కోట్లు వసూలు చేసిన సినిమా తొలి హిందీ సినిమాగా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్‌ పండితుల అంచనా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటికే రూ. 1350 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిన ఈ సినిమా తమిళ నాడులో వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక తెలంగాణ నైజా ఏరియాలో కనీవినీ ఎరగని రీతిలో 50 కోట్లు సాధించడం అపూర్వం. 
 
ఇదీ ‘బాహుబలి–2’ హిందీ వెర్షన్‌ లెక్కల చిట్టా ఇది. థియేటర్లలో సినిమా ఇంకా బాగా ఆడుతోంది కనుక లాభం మరింత పెరిగే అవకాశముంది. కొందరు ఔత్సాహికులైతే హిందీ ప్రాంతంలోనే రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని ముందస్తు అంచనా వేస్తున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి 2లో ప్రభాస్ వాటా చాలా తక్కువేనట.. ఎందుకనీ..?

ఎస్ఎస్ రాజమౌళి తీసిన అతి బారీ చిత్రం బాహుబలి-2 ది కంక్లూజన్ ఆదాయం శిఖరస్థాయికి చేరుకుంది. ...

news

'సాహో' తర్వాతనే ఏ డీల్ అయినా... రూ.18 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్!

'బాహుబలి' ప్రాజెక్టుతో జాతీయ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ ...

news

'బాహుబలి' రికార్డుల్ని బీట్ చేసేందుకు 'మెగా' పట్టు... MEKని కూడా పక్కనెట్టేస్తున్నారట...

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ...

news

హీరోయిన్లను నగ్నంగా చూసేందుకు వస్తున్నారనుకుంటున్నారా?: హీరోయిన్ మంజిమ

హీరోహీరోయిన్లకు ఫ్యాన్ క్లబ్ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలోనే వుంటోంది. ఫ్యాన్స్ లేవనెత్తే ...

Widgets Magazine