శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2015 (22:49 IST)

చెన్నై వరదలు... తమిళనాడు సీఎం సహాయనిధికి ప్రభాస్ రూ. 15 లక్షలు విరాళం

చెన్నై నగరం వరదల తాకిడికి గురై జనజీవనం అస్తవ్యస్తమైన నేపథ్యంలో రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్ తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 15 లక్షలు ప్రకటించారు. ఇంతకుమునుపే సూపర్‌స్టార్‌ మహేష్‌ చెన్నై వరద బాధితులకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - ''భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సాయంగా 10 లక్షలు సి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నాను'' అన్నారు.