శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:25 IST)

బాలకృష్ణ సినిమాలో విలన్ ఎవరు.. చంద్రబాబా.. లక్ష్మిపార్వతా..... ఆ మూడు ఘట్టాలు చూపిస్తారా..!

గౌతమీపుత్రశాతకర్ణిగా ఇటీవల నటించిన బాలాకృష్ణ మరో కీలకపాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ఎన్‌టిఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్లు చెప్పారు. ఎన్.టి.ఆర్ జీవితంపై పరిశోధన జరుగుతోందన్నారు. ఎన్.టి.ఆర

గౌతమీపుత్రశాతకర్ణిగా ఇటీవల నటించిన బాలాకృష్ణ మరో కీలకపాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ఎన్‌టిఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్లు చెప్పారు. ఎన్.టి.ఆర్ జీవితంపై పరిశోధన జరుగుతోందన్నారు. ఎన్.టి.ఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారితో ఆయన జీవిత విశేషాల గురించి అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎన్.టి.ఆర్ పాత్రలో స్వయంగా తానే నటిస్తానన్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను చూపిస్తామన్నారు. 
 
నిర్మాత డైరెక్టర్ ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామని, కృష్ణాజిల్లా నిమ్మకూరులో ప్రకటించారు బాలకృష్ణ. ప్రస్తుతం సినీవర్గాల్లో బాలకృష్ణ సినిమా చర్చకు తెరలేపుతోంది. కారణం ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర ఎన్నో మలుపులు తిరిగాయి. ముఖ్యంగా లక్ష్మీపార్వతితో వివాహం, కుటుంబ సభ్యులతో విభేదాలు, వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్.టి.ఆర్‌పై చంద్రబాబు వర్గం చెప్పులు విసరడం, ఆ తర్వాత ఆయన్ను పదవి నుంచి దించేయడం వంటి ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపిస్తారా లేదా అన్న ప్రశ్న. ఒకవేళ అలాంటి ఘట్టాలను పక్కనబెట్టి చిత్రాన్ని నిర్మిస్తే అది అసంపూర్ణమే అవుతుంది. ఎన్.టి.ఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తే మరి ఎన్.టి.ఆర్ మిగిలిన కుమారులుగా, ఎన్.టి.ఆర్ సతీమణులుగా ఆయన్ను పదవి నుంచి దించేసిన చంద్రబాబుగా ఆయా పాత్రలను ఎవరు పోషిస్తారో చూడాలి.
 
అంతేకాదు ఆ సినిమాలో విలన్ ఎవరన్నది ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. అప్పుడు జరిగిన పరిణామాలు కూడా అవే. అంతే కాదు లక్ష్మీపార్వతిపై అప్పట్లో ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏ విధంగా సినిమా తీస్తారు.. అందులో విలన్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారుతోంది. కేవలం ప్రకటన మాత్రమే ఉన్న ఎన్.టి.ఆర్ సినిమా ఇప్పుడు తెలుగుసినీపరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.