సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (17:02 IST)

బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' 4 రోజుల కలెక్షన్లు ఇవే..

veerasimhareddy
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. దీనికి కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. అలాగే, సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. తొలి రోజునే రూ.51 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.104 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ పోస్టరు ద్వారా వెల్లడించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగ ఇది నిలిచింది. 
 
ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, యాక్షన్, ఎమోషన్, బాణీలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఇవన్నీ కుదరడంతో ఈ సినిమా ఈ స్థాయిలో విజయం నమోదు చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.