నెక్ట్స్ సీఎం బాలయ్య... పుకార్లా.... నిజమా?
నందమూరి నట సింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ సినిమాలు రూపొందడం.. ఆ చిత్రాలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ సాధించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ భారీ క్రేజీ మూవీని ఎన్.బి.కె ఫిలింస్ బ్యానర్ పైన బాలకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే... ఈ మూవీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో బాలయ్య సీఎంగా కనిపించనున్నారని.
అయితే...ప్రచారంలో ఉన్న వార్తపై బోయపాటి క్లారిటీ ఇచ్చారు. గత సంవత్సరం బాలయ్యతో సినిమా చేయాలనుకున్నారట. ఆ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందించాలి అనుకున్నారట.
ఆ మూవీని ఎన్నికల ముందు రిలీజ్ చేయాలనుకున్నారట కానీ.. ఇప్పుడు ప్రారంభించే సినిమా ఎన్నికల తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో ఉండదు. ఇందులో బాలయ్య సీఎంగా కనిపించనున్నారు అనేది నిజం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు బోయపాటి. అదీ..సంగతి..!