గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (13:38 IST)

బాల‌య్య కొత్త సినిమా ప్రారంభమైంది. క‌థ ఎవ‌రిదో తెలుసా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే... క‌థ విష‌యంలో స‌మ‌స్య‌లు రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండ‌దా..? అనే అనుమానాలు వ‌చ్చాయి. అయితే.. ఈ సినిమాని సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభించారు. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ హిట్ కాంబినేష‌న్‌లో `జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌మిది. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మొదటి షాట్‌కి దర్శకులు కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌మించారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 
 
అయితే..ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తుండ‌డం విశేషం.  చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫీ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఓ ద‌ర్శ‌కుడు క‌థ - మ‌రో ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వం.. ఇలా ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి చేసే ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో..?