ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (12:43 IST)

రాజస్థాన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న #NBK109 మూవీ

balakrishna - bobby
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం షూటింగ్ ఇటీవలే రాజస్థాన్‌లో పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకుంది. వచ్చే అక్టోబరు నెల లోపు ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అలాగే, ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ డిసెంబర్‌లో 'పుష్ప-2', 'గేమ్ ఛేంజర్' లాంటి భారీ సినిమాల విడుదల ఉండటంతో 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఆలోచనగా వుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. సినిమా విడుదల తేదీని ఖరారు చేయనున్నారు.
 
ఇందులో ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన సినిమా ఇది. 
 
ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి, వెంకటేష్ తమ‌ సినిమాల విడుదలను ప్రకటించారు. 'విశ్వంభర' జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా ఓపెనింగ్ రోజే వెంకటేష్ అనీల్ రావిపూడిల సినిమాను పొంగల్ రిలీజ్ అని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.