సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:38 IST)

బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా టైటిల్ ఉగాదికే

Balyaya, boyapati
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అన‌గానే హిట్ గేరంటీ అనే నానుడి ఇండ‌స్ట్రీలో నెల‌కొంది. పక్కా మాస్‌తోపాటు ఏదో సామాజిక అంశాన్ని ట‌చ్ చేస్తారు. ఇంత‌కుముందు సింహా, లెజెండ్ కూడా మ‌హిళ‌ను గౌర‌వం తెచ్చేవిధంగా తెర‌కెక్కించారు. ఇప్పుడు మూడో సినిమాకు మంచి టైటిల్‌ను ప‌రిశీలించారు. ఉగాదికి ఆ వివ‌రాలు తెలియ‌య‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. చాలా కాలం త‌ర్వాత బాల‌య్య అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  
 
అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుని ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తామనే ప్రకటన చేస్తూ పోస్టర్ ను వదిలిన తరువాత, ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కరోనా వ్యాప్తి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, రిలీజ్ డేట్ వాయిదా వేసే ఉద్దేశంతోనే అప్ డేట్స్ ఇవ్వడం లేదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.
మరి ‘ఉగాది’కైనా అభిమానులను హుషారెత్తిస్తారేమో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేయనుంది.