సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (17:22 IST)

'మా' నుంచి నటి హేమ సస్పెన్షన్... క్లీన్ చిట్ వచ్చే వరకు కొనసాగుతుంది..

hema
బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని అరెస్టు అయిన సినీ నటి హేమపై "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్" సస్పెండ్ వేటు చేసింది. పోలీసుల నివేదికలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఆమెపై చర్య తీసుకున్నట్టు "మా" అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. అంతేకాకుండా, ఆమెకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.
 
నిజానికి నటి హేమను సస్పెండ్ చేసే అంశంపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఆమెకు ముందు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కొందరు అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం ఆమె బెంగుళూరు జైలులో ఉన్నారు. దీంతో ఆమె నుంచి వివరణ తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు మా ప్రకటించింది. ఈ మేరకు "మా" కార్యవర్గ సభ్యులందరికీ సమాచారం అందించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హేమకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని, మా సెక్రటరీ రఘుబాబు తెలిపారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 'మా' అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. విచారణ పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.