శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (19:00 IST)

బెంగాలీ నటి కోయల్ మల్లిక్‌తో పాటు మొత్తం కుటుంబానికి కరోనా!

Koel Mallick
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా.. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజా ఓ నటి కుటుంబం మొత్తానికి కరోనా సోకిందని తెలుస్తుంది. ఘోర్ అండ్ బైరే, ఛాయా ఓ ఛాబీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటి కోయల్ మల్లిక్ కరోనా బారిన పడ్డారు. 
 
కోయల్ తండ్రి రంజిత్ మల్లిక్ ప్రముఖ బెంగాలీ నటుడు ఆయన కూడా కోవిడ్ బారిన పడ్డారు. తల్లి దీపా మల్లిక్, కోయల్ భర్త నిర్మాత నిస్సాల్ సింగ్ సహా కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందరం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నామని మల్లిక్ తెలిపారు. "నాన్న, అమ్మ, రాణే (భర్త), నేను కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాం" అని ఆమె ట్వీట్ చేసింది. 
 
కాగా 2013లో నిర్మాత నిస్పాల్ సింగ్‌ను ఆమె పెళ్లాడింది. రెండు నెలల క్రితమే మే 5న ఆమెకు కొడుకు జన్మించాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఇంతలో కరోనా మహమ్మారి ఆమె కుటుంబాన్ని పీడించడం ఆందోళనకరమైన విషయమని సినీజనం వాపోతున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా ఆ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని బెంగాలీ చిత్రసీమ సభ్యులు ఆకాంక్షను వ్యక్తం చేశారు.