ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (15:38 IST)

కోల్‌కతాలో మరో మోడల్ బలవన్మరణం

Manjusha Niyogi
బెంగాల్ రాష్ట్ర వినోద రంగంలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే పల్లవి డే అనే బుల్లితెర నటి, మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే నటి బిదీషా మంజుదార్ అనే మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణాన్ని జీర్ణించుకోలేని మరో మోడల్ మంజూషా నియోగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కోల్‌కతాలో మోడల్, నటి బిదీషా మజుందార్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈమె స్నేహితురాలు, మోడల్ మంజూషా నియోగి ఆత్మహత్య చేసుకుంది. బిదీషా మృతిని జీర్ణించుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురైన మంజూషా తన అపార్ట్‌మెంట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బిదీషా చనిపోయినప్పటి నుంచి తన కుమార్తె మానసికంగా కుంగిపోయింది. తన స్నేహితురాలి మృతిని జీర్ణించుకోలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి తల్లిదండ్రులు వెల్లడించారు.