''భాగమతి'' ట్రైలర్ బాగుంది.. స్వీటీని పొగిడిన డార్లింగ్

మంగళవారం, 9 జనవరి 2018 (13:23 IST)

anushka - prabhas

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో ''పిల్ల జమీందార్'' ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''భాగమతి''. యూవీ క్రియేషన్స్‌‌ బ్యానర్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
 
ఈ ట్రైలర్‌కు ఇప్పటికే 2,002, 434 వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్‌పై తాజాగా డార్లింగ్ ప్రభాస్ స్పందించాడు. బాహుబలిలో అనుష్కతో కలిసి నటించిన ప్రభాస్.. తన స్నేహితురాలైన స్వీటి భాగమతి ట్రైలర్ బాగుందని కితాబిచ్చాడు. 
 
''భాగ‌మ‌తి'' చిత్ర ట్రైల‌ర్ గురించి ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందించారు. ట్రైల‌ర్ బాగుంద‌ని, స్వీటీని పొగిడాడు. అనుష్కకి క‌ష్ట‌ప‌డేత‌త్వం, అంకిత‌భావం ఎక్కువని ప్రభాస్ తెలిపాడు. సినిమాలో అనుష్క న‌ట‌న బాగుంద‌ని, ద‌ర్శ‌కుడు అశోక్‌కి, చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్‌కి ఆల్ ద బెస్ట్ అన్నాడు ప్రభాస్. డార్లంగ్ ప్రస్తుతం ''సాహో'' సినిమా షూటింగ్‌లో వున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ సినిమాలో నటిస్తాడు. దీనిపై మరింత చదవండి :  
Bhaagamathie Prabhas Devasena Baahubali Anushka Shetty Bhaagamathie Trailer

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి"కి ఎదురుదెబ్బ.. ఆ షోలకు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ ...

news

కత్తి మహేష్‌తో మంచి క్రిటిక్.. సుత్తి రాజేష్ అంటేనే నాకు పడదు: హైపర్ ఆది

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ...

news

వర్మా.. ఖర్మఖర్మ.. పబ్లిసిటీ కోసం ఆడవారి సమస్యను కూడా వదలట్లేదు..

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా, ...

news

గోల్డెన్ గ్లోబ్స్ 2018, లైంగిక వేధింపులకు నిరసనగా నల్ల దుస్తులు... ఆమె మాత్రం ఎర్ర దుస్తుల్లో?

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఫంక్షన్లలో గోల్డెన్ ...