శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (13:20 IST)

'ఆహా'లో 'భామా కలాపం' స్ట్రీమింగ్

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫాం "ఆహా". ఇందులో వివిధ రకాలైన వినోదం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో ఎప్పటికపుడు తనతో తానే పోటీపడుతూ ముందుకుసాగిపోతుంది. ఈ క్రమంలో ఇపుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
 
ప్రియమణి ప్రధాన పాత్రలో "భామా కలాపం" పేరుతో ఓ చిత్రాన్ని తెరక్కిస్తుంది. (A Delicious Home Cooked Thriller) అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ సమర్పణలో అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై భోగవల్లి బాపినీడు, ఈదర సుధీర్ నిర్మించారు. 
 
ఆదివారం "భామా కలాపం" చిత్రం గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. "ప్రియమణి ఏం వండుతున్నారో తెలియదుగానీ, మనకి మాత్రం ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌ను వడ్డిస్తారు" అంటూ ప్రోమోతో ఆకట్టుకుంటుంది. కాగా, ఈ చిత్రం త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.