శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (16:07 IST)

భీష్మ కలెక్షన్లు మామూలుగా లేవు... బాక్సాఫీస్‌నే షేక్ చేసేస్తోంది..

యంగ్ హీరో నితిన్ బంపర్ హిట్ కొట్టాడు. ఇటీవల కాలంలో ఇలా మీడియం సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినది డైరక్టర్ మారుతి అందించిన ప్రతి రోజూ పండగే సినిమానే. ఇప్పుడు భీష్మ ఆ సినిమాను మించిన టాక్‌తో దూసుకు వెళుతోంది. ఇక ప్రతి రోజు పండగే సినిమాకు ముందు యావరేజ్ టాక్ వచ్చింది. భీష్మకు అలా కాదు ముందు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
 
ఇకపోతే.. మూడు వరుస ఫ్లాప్‌ల తర్వాత నితిన్ నటించిన భీష్మ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.23కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకే ఏకంగా రూ.11కోట్ల షేర్ రాబట్టింది. భీష్మ రెండు రోజుల వసూళ్లు విశ్లేషిస్తే నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు కొన్న అమౌంట్ వచ్చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇక మూడు రోజులకే అన్ని ఏరియాల్లోనూ దాదాపు బ్రేక్ ఈవెన్‌కు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నైజాం, ఓవర్సీస్‌లో ఈ సినిమా మూడో రోజు నుంచే భారీ లాభాల భాట పట్టనుంది.