శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2017 (09:14 IST)

అవును! నేను నటిని కాకముందే చాలామందితో డేటింగ్ చేశా: భూమి

బాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో భూమి ఫడ్నేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో చేసింది కేవలం మూడు చిత్రాలే. ఆ మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

బాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో భూమి ఫడ్నేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో చేసింది కేవలం మూడు చిత్రాలే. ఆ మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఫలితంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం ఆరంభించారు. అలాగే, పలువురు బాలీవుడ్ ప్రముఖులతో లింకులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ లింకులపై ఆమె స్వయంగా స్పందించారు.
 
వ్యక్తిగత జీవితంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ... తాను ఇండస్ట్రీలోకి రాకముందు చాలామందితో డేటింగ్ చేశానని పేర్కొంది. తానో మోడ్రన్ యువతినని పేర్కొన్న ఆమె గతంలో చాలామందితో డేటింగ్ చేశానని వివరించింది. తాను ఒంటరినని, తాను ఎవరితోనూ పెద్దగా నటించలేదని, కాబట్టి రూమర్లకు అవకాశం లేదని కొట్టిపడేసింది. ప్రస్తుతం తాను పనినే పెళ్లి చేసుకున్నానంటూ అందరూ చెప్పే మాటలనే వల్లె వేసిందీ అమ్మడు.