శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:18 IST)

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ హర్/హిమ్... మీ ఓటు ఎవరికి?

‘బిగ్ బాస్ సీజన్ 2’ చివరి అధ్యాయం సమీపించనుంది. ఇప్పటికి 93 ఎపిసోడ్‌లు పూర్తి కాగా మరో 7 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ సీజన్ లేట్‌గా స్టార్ట్ అయ్యి 70 ఎపిసోడ్‌లకు మాత్రమే పరిమితమైంది. సెకండ్ సీజన్ మాత్రం 100 ఎపిసోడ్‌లు కొనసాగనుంది. 17 మంది కంటెస్

‘బిగ్ బాస్ సీజన్ 2’ చివరి అధ్యాయం సమీపించనుంది. ఇప్పటికి 93 ఎపిసోడ్‌లు పూర్తి కాగా మరో 7 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ సీజన్ లేట్‌గా స్టార్ట్ అయ్యి 70 ఎపిసోడ్‌లకు మాత్రమే పరిమితమైంది. సెకండ్ సీజన్ మాత్రం 100 ఎపిసోడ్‌లు కొనసాగనుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురే సభ్యులు మిగిలి వుండటంతో ఉత్కంఠ రేపుతోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఏడుగురు హౌస్‌మేట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. సోమవారం నాడు జరిగిన ఎలిమినేషన్ నామినేషన్స్ చాలా కీలకపాత్ర పోషించాయి. ఏడుగురిలో ఐదుగురు నామినేట్ అయ్యారు. కౌశల్, అమిత్, రోల్ రైడా, గీతా, దీప్తిలు ఈవారం నామినేట్ కాగా తక్కువ ఎపిసోడ్‌లు మిగిలి ఉన్న కారణంగా డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది.
 
గీత పుణ్యమాని సీజన్ మొత్తం నామినేషన్ భారాన్ని మోస్తున్న కౌషల్ టైటిల్ రేసులో అందరి కంటే ముందున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గీత కూడా గట్టి పోటీ ఇస్తోంది, అస్తమానం హౌస్‌లో కౌషల్‌తో విభేదిస్తూ వాగ్వివాదాలు చేస్తుండే ఈమె నామినేషన్స్‌కి రావడంతో కౌషల్ ఆర్మీ ప్రభావం ఎంతుంటుందో చూడాలి. ముందు నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రోల్, అమిత్, అతికష్టం మీద ఎలిమినేషన్ తప్పించుకున్న దీప్తికి ఇవి కీలకంగా మారాయి.
 
కౌషల్, గీతా మాధురికి బయట మద్దతు బాగానే ఉండటం వలన ఓట్లు బాగానే వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఇక ప్రమాదంలో ఉన్నది దీప్తి, అమిత్, రోల్ మాత్రమే. బిగ్ బాస్ మార్క్ డైలాగ్... ఏదైనా జరగచ్చు ఉండనే ఉంది కదా, సో కౌశల్, గీతలను బయటకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.