బిగ్ బాస్ 11: జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం.. ఏకిపారేసిన సల్మాన్ ఖాన్‌పై కేసు?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:32 IST)

ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 ఆరంభంలోనే వివాదస్పదంగా మారిపోయింది. వారాంతం ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యుల ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ మండిపడ్డాడు. బిగ్ బాస్ హౌస్‌లోని జుబైర్ ఖాన్, అర్షి ఖాన్‌కు సల్మాన్ క్లాస్ పీకారు. 
 
ఈ షో ప్రారంభం నుంచి ఆడామగా తేడా లేకుండా అందరినీ బూతులు తిడుతున్న జుబైర్ ఖాన్‌పై సల్మాన్ ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దావూద్ ఫ్యామిలీకి చెందిన వాడివంటూ వచ్చిన కథనం నీ జీవితాన్ని మార్చేసిందన్నారు. భార్యాపిల్లలు దూరమైనారు. వారికి దగ్గరవ్వాలని ఈ షోలోకి వచ్చావ్. అయితే ఇలాంటి ప్రవర్తనతో నిన్నెవ్వరూ దగ్గరకు చేరనిస్తారని సల్మాన్ ఖాన్ ప్రశ్నించారు. 
 
దావూద్ కుటుంబానికి చెందిన వాడివని ప్రచారం చేసుకోవడం ద్వారా భయాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నావా? అంటూ సల్మాన్ నిలదీశారు. డోంగ్రీ నుంచి వచ్చానని, డాన్ లంతా డోంగ్రీ నుంచి వచ్చిన వారేనని బెదిరిస్తున్నావు? మీకు డాన్ లని ఏ స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చింది? అని కడిగేశారు. డోంగ్రీ పరువు తీశావ్. అక్కడ తనకు తెలిసిన చాలామంది వున్నారని.. కానీ నీలాంటి దరిద్రులు లేరంటూ సల్మాన్ ఖాన్ ఏకిపారేశారు. జుబైర్ ఖాన్ 'అది కాదు సల్మాన్ భాయ్..' అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇకపై తనను అలా పిలవొద్దని హెచ్చరించాడు. 
 
ఆడవాళ్లను తిట్టడానికి సిగ్గుపడాలని సూచించాడు. ఈ సందర్భంగా షాహిద్ అఫ్రిదీ ప్రియురాలుగా ప్రచారం పొందిన అర్షిఖాన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, 'నీక్కూడా చెబుతున్నాను... పధ్ధతిగా మసలుకోవడం నేర్చుకో' అన్నాడు. మాటకోసారి అల్లా అంటున్నారని.. అలా అనేందుకు అర్హత లేదన్నారు. దేశం, ప్రాంతం, కుటుంబం, మతం పరువుతీశారని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ఇంట్లో ఇలానే ప్రవర్తిస్తారా? మీ అక్కాచెల్లెళ్ల వద్ద ఇలానే ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. 
 
అనంతరం జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం చేశాడని, ఐసీయూలో చేరాడని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో జుబైర్ ఖాన్ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఆపై  జుబైర్‌ ఖాన్‌ బిగ్ బాస్ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌‌పై ముంబైలోని అంటాప్‌ హిల్‌ పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. అతని మాటలతోనే జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబీకులు వాపోతున్నారు.దీనిపై మరింత చదవండి :  
Complaint Contestant Bigg Boss 11 Salman Khan Zubair Khan Dawood Ibrahim

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ...

news

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా ...

news

పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో ...

news

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, ...