శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (09:59 IST)

తమిళ 'బిగ్‌ బాస్-2'లో లిప్‌ కిస్‌లు... వీడియో వైరల్

విశ్వనటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ "బిగ్‌ బాస్ -2" ఇపుడు సంచలంగా మారింది. ఈ బిగ్‌ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ హద్దులుదాటి ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోలను లీక్ చేయడంతో ఇవి సోషల్

విశ్వనటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ "బిగ్‌ బాస్ -2" ఇపుడు సంచలంగా మారింది. ఈ బిగ్‌ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ హద్దులుదాటి ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోలను లీక్ చేయడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ముఖ్యంగా, బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేయడానికి కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌-6లో తమిళ కంటెస్టెంట్స్ జనని అయ్య‌ర్, ఐశ్వర్య ద‌త్త 'లిప్ టు లిప్ కిస్' పెట్టుకోవడం షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ విచిత్ర వేషధారణలతో పలు పాత్రలు పోషించారు. 
 
ముంతాజ్, బాలాడీ డైపర్లు వేసుకొని చిన్నపిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకొని మగరాయుళ్లను తలపించారు. ఐశ్వర్య, రమ్య కవలలుగా నటించారు. తెలుగు బిగ్‌బాస్-2 కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నేచుర‌ల్ స్టార్ నాని సీజ‌న్‌-2కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగా, తెలుగులో కూడా హీరో నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్-2 ప్రసారమవుతున్న విషయం తెల్సిందే.