శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (19:18 IST)

బిగ్ బాస్ నాలుగో సీజన్: నేను హీరో, నువ్వు హీరోయిన్.. టీపొడి, నూనె కలుస్తాయా? (Video)

Amma Rajasekhar, Divi Vadthya
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైంది. ఇందులో తొలి ఫిజికల్ టాస్క్ ప్రారంభం అయ్యింది. కానీ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్‌ను ఇంటి సభ్యులు పూర్తి చేయలేకపోయారు. టాస్క్ పూర్తి చేయకపోవడానికి కూడా కట్టప్పే కారణమని బిగ్ బాస్ పరోక్షంగా చెప్పాడు. దీంతో ప్రతిదానికి అడ్డుపడుతున్న ఈ కట్టప్ప ఎవర్రా బాబూ అని తలలు పట్టుకోవడం సభ్యుల వంతైంది.
 
మరోవైపు గంగవ్వ ఆరు పదుల వయస్సుల్లోనూ వేకువజామునే నిద్రలేచి అబ్బాయిలతో పోటీ పడుతూ వ్యాయామం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కిచెన్‌ను శుభ్రంగా ఉంచాలని మోనాల్ చెప్పగా.. అమ్మరాజశేఖర్ కొంత అసహనం ప్రదర్శించాడు. వంట చేయడం, శుభ్రం చేయడం ఒకేసారి ఎలా అవుతుందని అమ్మరాజశేఖర్ ప్రశ్నించాడు. అమ్మరాజశేఖర్ అలా చెప్పడంతో ఈ రోజు తాను భోజనం చేయనని ఉపవాసం ఉంటున్నానని చెప్పింది.
 
మరోవైపు కిచెన్‌లో అమ్మరాజశేఖర్, దివి ఒకరిపై ఒకరు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంతసేపు నేను హీరో, నువ్వు హీరోయిన్ అని దివితో అమ్మరాజశేఖర్ కబుర్లు చెప్పుకుంటూ నూనెలో టీ పొడి వేశాడు. వెంటనే నోయల్ వారిద్దరినీ టీపొడి, నూనెతో పోలుస్తూ అవి రెండూ కలవవు అని పంచ్ వేశాడు. 
 
ఇదిలా ఉంటే మోనాల్ అభిజిత్ ఒకరి గురించి మరొకరు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మోనాల్ పెద్దలు కుదిర్చిన వివాహమే పెళ్లి చేసుకుంటానని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికైతే ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేనని మోనాల్ స్పష్టం చేసింది. మరోవైపు నోయల్ ఇంటి సభ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహబూబ్‌, దేవి నాగవల్లి, దివి కలిసి నోయల్ మీద ర్యాప్ పాడి ఔరా అనిపించారు.
 
 అఖిల్‌, సోహైల్‌, కళ్యాణి, హారిక, లాస్య, సూర్యకిరణ్‌..నోయల్ అఖిల్, మెహబూబ్‌, సుజాత, అభిజిత్‌, లాస్యపై, మోనాల్‌, గంగవ్వ..అమ్మరాజశేఖర్‌పై, అరియానా, దివి, దేవి నాగవల్లి, అమ్మరాజశేఖర్, సూర్యకిరణ్‌పై స్టాంపు వేశారు. 
 
అయితే నోయల్ వంతు వచ్చేసరికి.. తనకు ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేదని, అందువల్లే తన ముఖంపై తానే ముద్రవేసుకుంటున్నానని చెప్పాడు. నోయల్ నిర్ణయాన్ని ఇంటి సభ్యులు వ్యతిరేకించారు. అలా చేస్తే నిజమైన కట్టప్ప నువ్వే అవుతావని ఇంటి సభ్యులు నోయల్‌ను వారించారు. నోయల్ మాత్రం ఈ విషయంలో మనసు మార్చుకోకపోవడంతో బిగ్ బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వే ముఖంపై స్టాంప్ వేసుకోవడానికి వీల్లేదని నిర్దేశించాడు.  
 
బిగ్ బాస్ జోకుకు హాయిగా నవ్వుల్లో మునిగితేలుతున్న ఇంటిసభ్యుల్లో ఎవరు ఎలిమినేషన్ నుంచి గట్టెక్కుతారు..? ఎవరు ఔట్ అవుతారనేది వచ్చే ఎపిసోడ్స్ లో తెలియనుంది. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరు ఎలిమేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయాలి.