శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (20:12 IST)

సమంత బిగ్ బాస్‌ షో.. రేటింగ్ ఎంతో తెలుసా..? (video)

బిగ్ బాస్.. బుల్లితెరపై బాగా సక్సస్ అయిన రియాల్టీ షో. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3.. ఈ మూడు సీజన్ లు సూపర్ సక్సస్ అవ్వడంతో బిగ్ బాస్ 4వ సీజన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలి సీజన్‌కి హోస్ట్‌గా చేసిన నాగార్జునే ఈ సీజన్‌కి కూడా హోస్ట్ కావడం ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. 
 
అయితే.. ఈ షో స్టార్ట్ అయినప్పడు కాస్త స్లోగా ఉంది. హౌస్‌లో సరైన కంటెస్టంట్లు లేరు అనిపించినా... తర్వాత తర్వాత మాత్రం ఆడియెన్స్‌కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ మేజర్ చేంజెస్‌నే చేసారు. దీనికితోడు వీక్ ఎండ్‌లో ఎంటర్‌టైన్మెంట్ బాగా ఉండడంతో మంచి రేటింగ్ వస్తుంది.
 
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లడంతో ఆ ఎపిసోడ్‌ను అక్కినేని కోడలు అక్కినేని సమంత హోస్ట్ చేసింది. అయితే గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్‌కు టీఆర్పీ రేటింగ్ ఎంత వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. బాగానే వస్తుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే... 11.4 గట్టి టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. 
 
మొత్తానికి మామయ్య ప్లేస్‌లో వచ్చి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ను సమంత బాగానే ఆకట్టుకుంది. దీంతో సమంతకు బుల్లితెర‌పై మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు. మాటీవీ యాజమాన్యమే సమంతతో ఓ స్పెషల్ పొగ్రామ్ ప్లాన్ చేసిన ఆశ్చర్యపో‌నవసరం లేదు అంటున్నారు. ముందుముందు బుల్లితెర పై సమంత ఎలాంటి సందడి చేయనుందో..? ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో..?