గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (09:23 IST)

బిగ్ బాస్ సీజన్-6 : కంటెస్టెంట్స్ ఎవరెవరంటే...

biggboss-6
వినోదానికి ఏమాత్రం కొదవలేని బిగ్ బాస్ రియాల్టీ ఆరో సీజన్ కోసం కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేశారు. ఈ దఫా మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాలుపంచుకుంటున్నారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ మన్మోథుడు, హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఈయన 21 మంది కంటెస్టెంట్స్‌న బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారికి అవకాశం కల్పించి, ఓపెనింగ్ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. 
 
కాగా, ఈ బిగ్ బాస్-6లో చోటు దక్కించుకున్న వారి వివరాలను పరిశీలిస్తే, కీర్తి భట్, సుధీప్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, మెరీనా, రోహిత్, బాలాదిత్య, వసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనాయా సుల్తానా, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి రావు, రేవంత్‌లు ఉన్నారు. ఈ షో ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్ చేసిన విషయం తెల్సిందే.