శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:53 IST)

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు

డ్రగ్స్ కేసులో ఓ బాలీవుడ్ నటుడు అరెస్టు అయ్యారు. ఆయన పేరు అజంఖాన్. ఈయన బాలీవుడ్ హీరోగానే కాకుండా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కూడా ఉన్నారు. నిషేధిత డ్రగ్స్ కేసులో నవీముంబై యాంటీ నార్కోటిక్ సెల్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.
 
బెలాపూర్‌తోని ఓ హోటల్ గదిలో అజంఖాన్‌ను అరెస్ట్ చేసి, ఆయన నుంచి 8 నిషేధిత డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అజంఖాన్‌ను కోర్టులో హాజరుపరుచనున్నట్లు చెప్పారు. 
 
అజంఖాన్ రెండేళ్ల క్రితం ఓ బ్యూటిషియన్‌కు అభ్యంతర ఫొటోలు, సందేశాలు పంపిన కేసులో అరెస్ట్ అవగా.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇపుడు ఆయన అరెస్టు కావడం రెండోసారి కావడం గమనార్హం.