మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (17:11 IST)

బిగ్ బాస్ గోల: జల్లికట్టు గర్ల్ జూలీని నానా మాటలన్న నమిత, ఆర్తీ, గాయత్రీ!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జల్లికట్టు పోరాటంలో పాల్గొని బాగా పాపులర్ అయిన జూలియానా అనే యువతి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటోంది. సినీ లెజెండ్ కమల్ హాసన్ జడ్జిగా వ్యవహరిస్తున్న బిగ్ బాస

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జల్లికట్టు పోరాటంలో పాల్గొని బాగా పాపులర్ అయిన జూలియానా అనే యువతి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటోంది. సినీ లెజెండ్ కమల్ హాసన్ జడ్జిగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఇటీవలే విజయ్ ఛానల్‌లో ప్రారంభమైంది. ఇందులో హీరోలు, హీరోయిన్లతో పాటు 15మంది పాల్గొంటున్నారు. వీరందరూ ఒకే ఇంట్లో 100 రోజులు వుండాలన్నదే బిగ్ బాస్ షో నిబంధన. 
 
ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయ్ టీవీ  బిగ్ బాస్‌కు చెందిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో హాస్యనటి ఆర్తీ, హీరోయిన్ గాయత్రీ రఘురామ్ వద్ద.. "రాజకీయ నేతలను ఏకిపారేసిన జల్లికట్టు గర్ల్ జూలీ బాగా ఫేమస్ అయ్యిందని.. కెమేరాలో తానే వుండాలని జూలీ భావించింది. మనమంతా వట్టి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు మాత్రమే" అంటూ చెప్పింది. 
 
ఆర్తీకి నమిత, గాయత్రీ రఘురామ్ కూడా వత్తాసు పలుకుతూ జల్లికట్టు గర్ల్‌ను తిడుతున్నారు. ఈ వీడియోను విజయ్ టీవీ కేవలం ప్రోమోగానే విడుదల చేసింది పూర్తి వీడియోను విజయ్ టీవీ శుక్రవారం రాత్రి విడుదల చేసే అవకాశం ఉంది.