సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:45 IST)

అషు రెడ్డి: ఫస్ట్ నైట్‌కు వెళ్తున్నారా? మామిడిపళ్ల రసాలు కావాలి, అది బిగ్ బాసా? బూతు బాసా?

Ashu
టీవీలో వచ్చే బిగ్ బాస్ వేరు... ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ వేరు. టీవీలో వచ్చే ఎపిసోడ్లలో ఎడిటింగ్ వుంటుంది. కానీ ఓటీటీలో యాజ్ ఇటీజ్. చెప్పింది చెప్పినట్లు వచ్చేస్తుంది. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఓటీటీలో 24 గంటలూ వస్తున్న బిగ్ బాస్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతుపురాణం తారాస్థాయికి వెళ్లిపోతోంది. షోలో కంటెస్టెంట్లు మాట్లాడుతున్న తీరు చూసి గేమ్ చూసేవారు అవాక్కవుతున్నారు.

 
మంగళవారం నాటి కెప్టెన్సీ టాస్కులో బిగ్ బాస్.. అఖిల్-బిందుమాధవిలను ఓ టీంగా ఏర్పాటు చేసాడు. ఈ గేముకి సంచాలకురాలిగా వ్యవహరిస్తున్న అషూ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. రెండు ఆరెంజస్ కావాలి, రెండు అరటి కాయలు కావాలి, రెండు మామిడపళ్ల రసాలు కావాలి అంటూ అఖిల్ అంటుండగా అఖిల్ వద్దకెళ్లి... టాస్క్ ఆడబోతున్నారా... ఫస్ట్ నైట్‌కు పోతున్నారా అంటూ సెటైర్లు వేసింది అషు.

 

ఇంకోచోట అషూ, అజయ్, అఖిల్, నటరాజ్ అంతా ఒకచోట చేరారు. అషు తప్ప మిగిలినవారు బెడ్ పైన పడుకుని గుసగుసలాడారు. అఖిల్ మాట్లాడుతూ... శివ-బిందు హీరోహీరోయిన్లు అన్నాడు. అంతే... దుప్పట్లే దడదడే అంటూ అజయ్ కామెంట్ చేసాడు. అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అంది. అజయ్ మళ్లీ అందుకుని గోడకేసి గుద్దు అంటూ మరింత లాగాడు. మొత్తమ్మీద రోజువారీ డబుల్ మీనింగ్ డైలాగులతో బిగ్ బాస్ కాస్తా బూతు బాస్ గా మారుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.