శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (14:45 IST)

బిగ్ బాస్ మూడో సీజన్.. చప్పగా సాగుతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. శిల్పా అవుట్

ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడో సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇప్పటివరకు ఆరు ఎలిమినేషన్లు జరుగగా మరో ఎలిమినేషన్ జరుగనుంది. ఆమె ఎవరో కాదు.. హౌజ్‌లోకి రెండవ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్పా చక్రవర్తి.

కానీ గేమ్ ప్లాన్ సరిగ్గా లేకపోవడం అలాగే రావడమే హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్‌ను టార్గెట్ చేయడంతో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయడానికి ఇష్టపడలేదు. దాంతో అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా శిల్పా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లనుంది.
 
ఇదిలా ఉంటే గత రెండు సీజన్ల తో పోలిస్తే ఈసీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీ చప్పగా సాగింది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు జరిగాయి. అందులో మొదటగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా మొదటి వారంలోనే నామినేషన్‌లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వగా రెండు వారాల క్రితం రెండు వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన శిల్పా చక్రవర్తి కూడా మొదటి సారి నామినేషన్‌లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వనుంది. అలా ఈరెండు ఎంట్రీలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
 
బిగ్‌బాస్‌ ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు సూచనలు ఇవ్వడం..లాంటివే కాకుండా.. హౌస్‌మేట్స్‌తో ఆట ఆడించడం హైలెట్‌గా నిలిచింది. హౌస్‌మేట్స్‌లో ప్రోత్సాహాన్ని నింపేందుకు బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పీవీ సింధును బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి నాగార్జున తీసుకువచ్చాడు.
 
బిగ్‌బాస్‌పై తిరుగబాటు చేసిన పునర్నవి, మహేష్‌లకు నాగార్జున గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. బుల్‌షిట్‌ టాస్క్ అంటావా? అలాంటి మాటల మాట్లాడేదంటూ పునర్నవిని మందలించాడు. గేట్లు తెరిచే ఉన్నాయి వెళ్తావా? అంటూ మహేష్‌పై సీరియస్‌ అయ్యాడు. అయితే మహేష్‌ విషయంలో రాహుల్‌, పునర్నవిని వరుణ్‌ ఒప్పించిన విధానం బాగుందని వారిని మెచ్చుకున్నారు. 
 
మిగతా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నందుకు శ్రీముఖిపై ఫైర్‌ అయ్యాడు. రూల్స్‌ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆడావని, అందుకే పునర్నవికి కోపం వచ్చిందని.. రూల్స్‌ను ఫాలో అవుతూ గేమ్‌ ఆడాలని శిల్పాకు సూచించాడు.