మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:43 IST)

బిగ్‌బాస్‌ సీజన్ 6.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం.. హౌస్ ఇదే..

Bigg boss house
Bigg boss house
బిగ్‌బాస్‌ సీజన్ 6 టెలికాస్ట్ ప్రారంభ తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి బిగ్‌బాస్‌ మొదలవనుంది. గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్‌గా చేయనున్నారు.  
 
తాజాగా ఈ షో నుంచి మొదటి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొత్త బిగ్‌బాస్‌ హౌస్‌ని పాక్షికంగా చూపించారు. అలాగే లాంచింగ్ ఎపిసోడ్‌కి చాలా పర్ఫార్మెన్సులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 
 
లాంచింగ్ గ్రాండ్‌‌‌‌‌గా చేయనున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ హౌస్‌ని చూపిస్తూ రిలీజ్ చేసిన అయి టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. దీంతో బిగ్‌బాస్‌ అభిమానులు ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు.