Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ ఆ పని చేశారు.. అందుకే ఆయనంటే ఇష్టం: శివబాలాజీ

గురువారం, 28 సెప్టెంబరు 2017 (11:50 IST)

Widgets Magazine

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ చెప్పాడు. శివబాలాజీ పవన్ కల్యాణ్ అభిమాని. సాధారణంగా పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని. పవన్‌తో తనకు ఏడేళ్ల పరిచయం వుందన్నాడు. ఏడేళ్ల క్రితం అన్నవరం సినిమా షూటింగ్ సందర్భంగా పరిచయమైందని తెలిపాడు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని అన్నాడు.
 
సాధారణంగా పవన్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇష్టపడరని.. కానీ కాటమరాయుడు సినిమా షూటింగులో తన  పుట్టిన రోజును మాత్రం యూనిట్ సభ్యులందరి మధ్య, తన కుటుంబ సభ్యులందరి సమక్షంలో చేశారు. అది తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. అందుకే పవన్ కల్యాణ్ కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. తను ప్రజానాయకుడు కావడంతో ఆయనకు కత్తిని బహూకరించానని శివబాలాజీ వెల్లడించాడు.
 
మరోవైపు ‘బిగ్‌బాస్’ విజేత శివబాలాజీ తన మాజీ హౌస్‌మేట్ ధనరాజ్ ఇంటికి వెళ్లాడు. ధన్‌రాజ్ రెండవ బిడ్డను ఎత్తుకుని ముద్దాడాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన తర్వాత శివబాలాజీ తన భార్య, నవదీప్‌తో కలిసి ధన్‌రాజ్ ఇంటికి వెళ్లాడు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ధన్‌రాజ్ తండ్రి అయినందుకు శివబాలాజీ అభినందించాడు. 
 
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ధన్‌రాజ్‌కు కొడుకు పుట్టాడని శుభవార్త అందింది. కొడుకు పుట్టడానికి నాలుగు రోజుల ముందు ధన్‌రాజ్ ఆలోచనలన్నీ తన ఇంటి వైపే ఉండేవి. ఈ ఆలోచనతో వంటగదిలో పాత్రలు కడిగేటప్పడు గ్లాసులన్నీ పగిలిపోయాయి. 
 
ధన్‌రాజ్ ఇంటి గురించి ఆలోచిస్తూ చాలా వర్రీ అయ్యేవాడు. ఎలిమినేషన్ రోజు బయటకి వెళ్లేటప్పుడు అందరూ బాధపడుతారు. కానీ ధన్‌రాజ్ మాత్రం ఎగిరి గంతేశాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ధన్‌రాజ్‌ ఇంటికి వెళ్లి.. బాబును చూడాలనుకున్నానని శివబాలాజీ చెప్పకొచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త ...

news

సోషల్‌ మీడియాకు దూరంగా వుండి.. పక్కనున్న వ్యక్తిని ప్రేమించండి.. స్పైడర్ ప్లస్ అండ్ మైనస్

సైన్స్‌ ప్రకారం ప్రతి మనిషిలో వికృత మనస్తత్వం (సైకో) నాలుగు శాతం వుంటుంది. దానివల్లే ...

news

టీ వీ షో అంటో ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదు: మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టీవీ షోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''స్పైడర్" సినిమా ...

news

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రాకు స్థానం.. క్వాంటికో సీరియల్‌తో..

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటీమణుల జాబితాలో అంతర్జాతీయ స్టార్ ...

Widgets Magazine