మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (10:30 IST)

బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగలేదు.. ఇదే తొలిసారి.. అభిజీత్‌ ఫ్యాన్స్ పండుగ..?

Abhijeet
బిగ్ బాస్ నాలుగో సీజన్ త్వరలో పూర్తి కానుంది. మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం ఉన్న హౌస్‌లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్‌లకు బిగ్ బాస్ జర్నీ చూపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. హౌస్‌లో ఎంటరైనప్పటి నుంచి ఫైనల్ వెళ్లే వరకు సాగిన ప్రయాణ క్రమాన్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. తమ జర్నీని స్క్రీన్‌పై చూసుకొని అఖిల్, అభిజీత్ మురిసిపోయారు. ఐతే అభిజీత్ ఏవీ సందర్భంగా బిగ్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు.
 
హౌస్‌లోకి యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన మీరు.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ సాధించారు. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్ని మరెన్నో బంధాలను ఏర్పరచుకున్నారు. కష్టాలను దాచుకుని బాధపడ్డారు. మీరు మీకంటే ఎక్కువగా వేరే వాళ్ల గురించి ఆలోచించారు. ఇంటి సభ్యులకు మర్యాద ఇచ్చారు.. తిరిగి తీసుకున్నారు. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నారు' అని కామెంట్స్ చేశాడు. 
 
బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఓ ఇంటి సభ్యుడిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి. బిగ్‌బాస్ ఆ మాట అన్న వెంటనే అభిజీత్ ఉబ్బితబ్బిపోకుండా.. మరోసారి మెచ్యూర్డ్ మ్యాన్‌లా ప్రవర్తించాడు. ''అయ్యో బిగ్ బాస్.. ఈ ఇంటికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నా.'' అని పేర్కొన్నాడు. బిగ్ బాస్‌కు వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నానని చెప్పాడు. ఇక అభిపై బిగ్ బాస్ ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అభిజీతే విన్నర్ అవుతాడనడానికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగిస్తున్నారు.