ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (18:56 IST)

ప్రభాస్ బ‌ర్త్‌డే నాడు బిల్లా 4K యుస్‌.లోనూ విడుదల

prabhas
prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మువీగా మిగిలిపోయింది బిల్లా. హై క్లాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఈ మూవీ అంటే ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. ఇండియన్ స్క్రీ న్ మీద స్టైలిష్ ఫిల్మ్ అని పేరు తెచ్చుకున్న బిల్లా సినిమా  డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర స్పెషల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
 
రీ రిలీజ్ ను ఎయిమ్ చేస్తూ  కట్ చేసిన ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. బిల్లా థీమ్ సాంగ్ నేపథ్యంగా సాగే ఈ ట్రైలర్ కృష్ణంరాజు గారి పోర్షన్ తో ప్రారంభమైంది. ఆయనకు నివాళిగా ట్రైలర్ లో కృష్ణంరాజు గారి పోర్షన్స్ పెట్టారు. ప్రభాస్ చేసిన హై ఎండ్ యాక్షన్ సీన్స్ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చాయి. ఇవన్నీ ప్రభాస్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ కానున్నాయి. బిల్లా 4కె దేశవ్యాప్తంగానే కాదు యూఎస్ లోనూ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యూఎస్ లో అత్యధిక స్క్రీన్స్ తో రిలీజ్ చేస్తున్నారు.