బాబీ, పి.భవానీ రవి కుమార్ గెస్ట్ లుగా వాల్తేర్ వీరయ్య 100రోజులు వేడుక
chiru, P.Bhavani Ravi Kumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య 100రోజులు వేడుక ఈనెల 22న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరగనుంది. ఈ వేడుకకు చిత్ర దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక అతిధిగా రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు, పి.భవానీ రవి కుమార్ హాజరు కానున్నారని చిరంజీవి అభిమానులకు ట్వీట్ చేశారు. ఈ విషయాన్నీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాకులు స్వామి నాయుడు తెలిపారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేశారు. చీపురుపల్లిలోని డివివి నగర్‌లో ఫంక్షన్ జరగనుంది. ఒకవైపు ఆర్.ఆర్.ఆర్.తో వరల్డ్ స్టార్ అయిన రామ్ చరణ్, ఇంకోవైపు ఉపాసన ప్రెగెన్సీ శుభకమైన విషయాలుగా అభిమానులు సందడి చేసుకుంటున్న సమయంలో వాల్తేర్ వీరయ్య 100రోజులు వేడుక జరగడం మరో విశేషం.