మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (11:15 IST)

"లక్ష్మీస్ ఎన్టీఆర్‌"లో లక్ష్మీపార్వతిగా రూపాలీ సూరి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించనున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి పాత్రకు దర్శకుడు వర్మ ఓ మోడల్‌ను ఎంపిక చేశారు. ఆమె మోడల్ పేరు రూపాలీ సూరి. 
 
'డ్యాడ్‌... హోల్డ్ మై హ్యాండ్‌' అనే హాలీవుడ్ చిత్రంలో ఈ బాలీవుడ్ నటి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనను చూసి వర్మ ఈ పాత్రకు రూపాలీని ఎంపిక చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. కాగా, ఈ చిత్రానికి ఇటీవలే తిరుపతిలో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెల్సిందే. 
 
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, సంక్రాంతి నాటికి సినిమాను సిద్ధం చేయాలన్నది వర్మ ఆలోచన. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తున్నారన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. 
 
చంద్రబాబు పాత్ర కోసం ఓ చిన్న హోటల్ కార్మికుడిని ఆయన ఎంపిక చేసుకోగా, లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలే ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుంది.