Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విడాకులిచ్చిన మాజీ భార్యతో హీరో చెట్టాపట్టాల్... డిన్నర్‌కు తీసుకెళ్లీ...

సోమవారం, 5 జూన్ 2017 (17:06 IST)

Widgets Magazine

భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఇక జన్మలో ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి వుండదు. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని తెంచుకునేంతట గాయం ఇద్దరిలో ఎవరికో అయితేనే విడాకులు దాకా వెళ్తుంది జంట. ఒక్కసారి విడాకులయ్యాక మళ్లీ వారిద్దరూ కలవడమంటే... దాదాపు వుండదనే చెప్పొచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ తీసికట్టు. పొద్దున్నే విడాకులు తీసుకుని సాయంత్రానికి ఇద్దరూ ఎంచక్కా డిన్నర్ చేసి, ఆ తర్వాత సొంత ఫ్లాటులో ఇద్దరూ కలిసి నిద్రించే పరిస్థితికి వెళ్లిపోయింది వ్యవహారం. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇదిగో బాలీవుడ్ హీరో సంగతే.
hrithik-susanne
 
హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసాన్నే ఖాన్ వ్యవహారం చూస్తుంటే ప్యాచప్ పడినట్లే కనిపిస్తోందంటున్నారు బాలీవుడ్ సినీ జనం. దానికి బలాన్ని చేకూరుస్తూ... గత రాత్రి ఇద్దరూ కలిసి ఓ హోటలులో డిన్నర్ చేస్తూ కనిపించారట. అర్థరాత్రి వరకూ బయటకు రాలేదట. పైగా హోటలులోకి వెళ్లేటపుడు ఇద్దరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించారట.
 
విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులుగా వుండిపోయామని చెపుతున్నారు వీరిద్దరూ. మూడు సంవత్సరాల క్రితం వీరిరువురూ విడిపోయారు. విడిపోయారన్నమాటే కానీ కలిసి తిరగకుండా కనిపించిన సంఘటనలు దాదాపు అరుదు. కంగనా రనౌత్ న్యాయపరమైన చిక్కులను హృతిక్ కు కలిగించిన సందర్భంలో ఈ మాజీ భార్య అతడికి వెన్నుదన్నుగా నిలించిందట. ఆ తర్వాత విడాకుల సంగతి పక్కనపడేసి పిల్లాజల్లాతో హాయిగా తిరుగుతున్నారు. మొత్తమ్మీద కంగనా రనౌత్ వీరి బంధాన్ని మళ్లీ గట్టిగా అతికించిందేమోనని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. నిజమేనేమో మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నందమూరి కళ్యాణ్‌రామ్‌ - కాజల్ అగర్వాల్ నూతన చిత్రం 'MLA' ప్రారంభం

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న ...

news

ఒక్కర్తినే గదిలో కూర్చుని ఏడుస్తానంటున్న అనుష్క... ఎందుకు?

బాహుబలి చిత్రంలో కత్తులు తిప్పుతూ, ఒళ్లు జలదరించే యుద్ధ విన్యాసాలు చేసిన దేవసేన అనుష్కకు ...

news

మొదటి సినిమా అల్లు అర్జున్‌తో చేస్తే కెరీర్ ఫట్టేనా?

టాలీవుడ్‌లో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు ...

news

అడగ్గానే అందుకు ఒప్పేసుకుందట టబు... అఖిల్ కోసం...

ఎటో వెళ్ళిపోయింది మనస్సు.. ఇలా ఒంటరయ్యింది... అనే పాట వింటే వెంటనే నాగార్జున, టబులు ...

Widgets Magazine