గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఇయరాజా బయోపిక్... హీరోగా ధనుష్!

ilayaraja
సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ సంగీత మేధావి ఇళయరాజా అభిమానులే. చిత్రసీమలోని దర్శకులు, రచయితలు, కథానాయకుల్లో చాలామంది సంగీతం అంటే పడి చస్తారు. అందులో బాలీవుడ్ దర్శకుడు బాల్కీకి ఇళయరాజా అంటే ఎంత అభిమానమో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తాయి. ఇళయరాజా పాత పాటల్ని తన సినిమాల్లో తెలివిగా వాడుకొంటారాయన. 
 
ఇప్పుడు బాల్కీ దృష్టి ఇళయరాజా బయోపిక్‌పై పడింది. ఆయన జీవితాన్ని సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నట్టు బాల్కీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. 'నాకు ఇళయరాజా అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. ఆయన కథ చెప్పాలని ఉంది. ధనుష్ ఇళయరాజా పోలికలు కనిపిస్తాయి. 
 
యవ్వన దశలో ఇళయరాజా అలానే ఉండేవారేమో. పైగా ధనుష్ కూడా ఇళయరాజాకు వీరాభిమాని. అందుకే వీలు కుదిరితే... ధనుష్ ఇళయరాజా బయోపిక్ తీస్తా' అని చెప్పుకొచ్చారు. ఆయన తలచుకొంటే స్వరజ్ఞాని కథ తెరపైకి రావడం అంత కష్టమేం కాదు. మరి ధనుష్ ఏమంటాడో చూడాలి.