శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (17:23 IST)

మేల్ ప్రెగ్నెన్సీపై సినిమా.. దేశమంతా వార్త వైరల్

బోల్డ్ కంటెంట్లకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. ఇవికాకూండా కొంతమంది కొత్త కొత్త ప్రయోగాలను కూడా చేస్తున్నారు. బాలీవుడ్ జనాలు బోల్డ్ కంటెంట్ ఆదరిస్తారు. ఇటు ఫ్యామిలీ కంటెంట్ ఆదరిస్తారు. ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో 'మేల్ ప్రెగ్నెన్సీ' అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. 
 
బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో దిల్జీత్‌ సింగ్‌.. నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.