బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (10:50 IST)

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన 'బేబమ్మ'

"ఉప్పెన" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 2020లో వచ్చిన ఈ చిత్రం ద్వారా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత "శ్యామ్ సింగారాయ్", "బంగార్రాజు" చిత్రాల్లో ఆమె ఫుల్ గ్లామరస్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆమె "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'', "ది వారియర్", "మాచర్ల నియోజకవర్గం" వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
అయితే, తాజాగా కృతి శెట్టికి సంబంధించిన ఓ విషయం ఇపుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. నాని, కృతిశెట్టి, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన "శ్యామ్ సింగారాయ్" చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 
 
ఈ చిత్రంలో షాపిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. తెలుగులో కృతి శెట్టి పోషించిన పాత్రను హిందీ రీమేక్‌లో కూడా ఆమె చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు సంప్రదించినట్టు సమాచారం. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడికావాల్సివుంది.