సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (14:02 IST)

బాలీవుడ్‌లో ఆఫర్లే ఆఫర్లు.. బిజీ బిజీగా వున్న రష్మిక మందన్న

rashmika mandanna
కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన రష్మిక.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆమె హిందీలో 'గుడ్ బై' అనే సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ 'మిషన్ మజ్ను' సినిమాలో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నారు.
 
ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే రష్మికకి బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో సినిమా సైన్ చేసింది ఈ బ్యూటీ. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ లో దర్శకుడు శశాంక్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనాను తీసుకోవాలనుకుంటున్నారు. రష్మికని తీసుకోవడం వలన కథను ఫ్రెష్ నెస్ వస్తుందని భావిస్తున్నారు. 
 
టైగర్ ష్రాఫ్ తోనే కాకుండా రణబీర్ కపూర్‌తో 'యానిమల్' అనే సినిమా చేస్తోంది రష్మిక. దీన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటుంది రష్మిక. త్వరలోనే అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. 
 
ఈ సినిమాతో పాటు విజయ్ నటిస్తోన్న 'వారసుడు'లో రష్మిక హీరోయిన్‌గా కనిపించనుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.