శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 30 జులై 2015 (11:35 IST)

బాహుబలి-2'లో బాలీవుడ్ తారలు... అంచనాలను పెంచుతున్న రాజమౌళి..

బాక్సాఫీసు‌ను బద్దలుకొట్టిన బాహుబలి చిత్రం రెండో పార్ట్‌ను తెరకెక్కించడానికి చిత్ర దర్శకుడు రాజమౌళి సిద్ధవుతున్నాడు. తెలుగు, తమిళం, హిందీలతో పాటు పలు భాషల్లో విడుదలైన బాహుబలి-1 భారీ వసూళ్లను కుమ్మరిస్తోంది. మొదటి పార్టుకి లభించిన ఆదరణ నేపథ్యంలో రెండో పార్టుకి కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.  

అందుకు తగ్గట్టుగా అంచనాలను భారీగా పెంచే రీతిలో రెండో భాగాన్ని తెరకెక్కించేరీతిలో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ముఖ్యంగా రెండో భాగంలో కొన్ని పాత్రలకు బాలీవుడ్ టాప్ స్టార్లను తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఈ విషయంలో కొందరు బాలీవుడ్ నటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయంలో ఎవరు ఫైనల్ అయ్యారన్నది త్వరలో వెల్లడవుతుంది.