శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (15:45 IST)

వెండితెరపై శ్రీదేవి బయోపిక్ : ఏర్పాట్లు చేస్తున్న బోనీకపూర్

'అతిలోకసుందరి' శ్రీదేవి జీవిత చరిత్ర బయోపిక్‌గా వెండితెరపై రానుంది. ఇందుకోసం ఆమె భర్త బోనీ కపూర్ చర్యలు చేపట్టారు. 1967లో బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, తెలుగు సినీ రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు శాసించారు. 
 
ఆమెకు 50 యేళ్లు దాటినప్పటికీ.. అందంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఆమెని అభిమానించే అభిమానులు ఇప్పటికి చాలామందే ఉన్నారు. కేవలం మనదేశంలోనేకాదు విదేశాలలోనూ శ్రీదేవిపై అంతులేని అభిమానాన్ని చూపించే ప్రేక్షకులు ఉన్నారు. 
 
ఆమె మ‌ర‌ణం శ్రీదేవి కుటుంబస‌భ్యుల‌నే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని షాక్‌కి గురిచేసింది. శ్రీదేవి భౌతికంగా మ‌న ద‌గ్గ‌ర లేక‌పోయిన సినిమాల‌తో ఇప్ప‌టికి అభిమానుల‌ని అల‌రిస్తూనే ఉంది. చివ‌రిగా 'జీరో' అనే సినిమాలో నటించింది. 
 
ఈ నేపథ్యంలో శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించాలని అనేక మంది దర్శకులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ అలాంటి అవకాశాన్ని ఆమె భర్త ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఆయనే శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించాలని నిర్ణయించారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నట్టు సమాచారం. పుస్త‌క రూపంలోనూ శ్రీదేవి జీవితాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురానున్నాడ‌ట బోనీ. మ‌రి శ్రీదేవి పాత్ర కోసం ఏ న‌టిని ఎంపిక చేసుకుంటారో వేచిచూడాల్సిందే.