శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (15:01 IST)

బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వారక క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ప్రారంభం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద

బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వారక క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ప్రారంభం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం.2 చిత్రం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో సినిమా కార్యాల‌యంలో లాంఛనంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి త‌న‌య మిర్యాల ద్వార‌క‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న‌య బోయ‌పాటి జోషిత క్లాప్ కొట్ట‌గా, తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను త‌న‌యుడు మాస్ట‌ర్ బోయ‌పాటి హ‌ర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 
 
రీసెంట్‌గా 'స‌రైనోడు' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయ‌పాటి చిత్రంలో స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌ర్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.... 'బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాంబినేష‌న్‌లో మా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా లాంచ‌నంగా ప్రారంభమైంది. ఈ నవంబ‌ర్ 16 నుండి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్ర‌సాద్‌ సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం' అన్నారు.